24 అక్బర్‌ రోడ్డును వీడనున్న కాంగ్రెస్‌! | Centre asks congress to vacate decades old delhi HQ at 24, Akbar road | Sakshi
Sakshi News home page

24 అక్బర్‌ రోడ్డును వీడనున్న కాంగ్రెస్‌!

Published Wed, May 17 2017 10:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

24 అక్బర్‌ రోడ్డును వీడనున్న కాంగ్రెస్‌! - Sakshi

24 అక్బర్‌ రోడ్డును వీడనున్న కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని 24 అక్బర్‌ రోడ్డులో ఉన్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఆ పార్టీని ఖాళీ చేయించాలని యోచిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు, మరో మూడు భవంతులను కాంగ్రెస్‌ వినియోగించుకుంటోందని ఆరోపించింది. పార్టీకి కేటాయించిన స్థలం కన్నా అధికంగా వాడుకుంటోందని ఆర్టీఐ ప్రశ్నకు బదులిచ్చింది.

ఇతర మూడు భవంతులు 5 రైసినా రోడ్డులో, 26 అక్బర్‌ రోడ్డులో, సీ–2–109 చాణక్యపురిలో ఉన్నాయి. రైసినా రోడ్డు భవంతిని కాంగ్రెస్‌ యువజన విభాగానికి కేటాయించారు. 26 అక్బర్‌ రోడ్డు, చాణక్యపురి రోడ్డు భవనాలను పార్టీ కార్యకలాపాలకు వాడుకుం టున్నారు. నాలుగు భవంతుల కేటాయింపులను 2013 జూన్‌ 26నే రద్దు చేశామని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement