ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కారు ప్రమాదానికి గురైంది...
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. యాక్సిస్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అమృత.. సాయంత్రం పని పూర్తయిన అనంతరం తన ఇనోవా కారులో ఇంటికి బయలుదేరింది.
శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో లోయర్ పరేల్ వద్ద వేగంగా వచ్చిన ఓ సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఇనోవా కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అమృత ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.