అమృతా రాయ్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ | Congress' Digvijaya Singh tweets about relationship with TV anchor | Sakshi
Sakshi News home page

అమృతా రాయ్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్

Published Fri, May 2 2014 3:09 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

అమృతా రాయ్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ - Sakshi

అమృతా రాయ్ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్(67) ప్రేమాయణంతో వెలుగులోకి వచ్చిన రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్(43)తన ఈమెయిల్ ఖాతాను హ్యాక్ చేశారని చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన ఈమెయిల్‌ను హ్యాక్ చేసి, తన గౌరవాన్ని మంటగలిపే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.

 

దీంతో పోలీసులు సమాచార,సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అమృతతో తనకు సన్నిహిత సంబంధముందని దిగ్విజయ్ బుధవారం ట్విట్టర్‌లో ప్రకటించడం తెలిసిందే. అమృత, ఆమె భర్త విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, అది పరిష్కారమయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement