కానిస్టేబుల్ అరెస్టు
Published Wed, Jan 15 2014 11:17 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
ఘజియాబాద్: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేవుడంటూ మద్యం మత్తులో కౌశాంబి ప్రాంతంలోని ఆయన అపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లిన ఓ పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబంతో కలిసి గిర్నార్ టవర్‌లో ఉంటున్న కేజ్రీవాల్ అపార్ట్‌మెంట్‌లోకి మంగళవారం సాయంత్రం వెళ్లేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన ఈ కానిస్టేబుల్ కేజ్రీవాల్ దేవుడని, ఆయనను కలుస్తానని వారించాడని అన్నారు. మద్యం తాగినందువల్లనే తాము అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement