కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించేందుకు కాంట్రాక్ట్ పద్ధతులను తీసుకొస్తున్నాయని నగర ప్రముఖ వైద్యుడు డాక్టర్ అరవింద్ పటేల్ అన్నారు.
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించేందుకు కాంట్రాక్ట్ పద్ధతులను తీసుకొస్తున్నాయని నగర ప్రముఖ వైద్యుడు డాక్టర్ అరవింద్ పటేల్ అన్నారు. శుక్రవారం అఖిల భారత యూటీయూసీ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర సంయుక్త ఆశ కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో రాఘవ కళామందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆశ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల ప్రభుత్వాలు విద్య, ఆరోగ్య రంగాలను సంపూర్ణంగా విస్మరిస్తున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు అని, ఈ దిశలోనే ప్రభుత్వాలు వీటిని కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐయూటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కే. సోమశేఖర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, ఉద్యోగులకు నిత్యవసరాల ధరలు పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
దీనికి ఆశ కార్యకర్తలు కూడా ఇతర కార్మికుల తో కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఎస్ జిల్లాధ్యక్షురాలు ఎంఎస్.మంజుళ, ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర కార్యదర్శి డీ.నాగలక్ష్మీ ప్రసంగించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.దేవరాయ, జిల్లాధ్యక్షురాలు ఎస్.వీరమ్మ, నేతలు గీత, రాజేష్, శివకుమారి, నేత్రావతి, యల్లమ్మ, జల జాక్షి, అనంతలక్ష్మీ, గౌరమ్మ పాల్గొన్నారు.