
ఆర్కేనగర్‌లో పురందేశ్వరి ప్రచారం
చెన్నై(కేకేనగర్): ఆర్కేనగర్ నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్‌కు మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందరేశ్వరి ఆదివారం ప్రచారం చేశారు. కొరుక్కుపేటలో ఉన్న కామరాజనగర్, భారతీనగర్ తదితర తెలుగు ప్రాంతాల్లో ఆమె పర్యటించి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పాలనకు ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. అందుకే ఆర్కేనగర్ ఉప ఎన్నికలో కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి అమరన్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, పార్టీ నాయకులు, చక్రవర్తి నాయుడు, శక్తివేల్ చెన్నై జిల్లా అధ్యక్షుడు ధనుంజయ్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.