కొంభన్‌లో ప్రేమ సన్నివేశాలు లేవు | director muthiah Interview | Sakshi

కొంభన్‌లో ప్రేమ సన్నివేశాలు లేవు

Mar 18 2015 1:54 AM | Updated on Sep 27 2018 8:49 PM

కొంభన్‌లో ప్రేమ సన్నివేశాలు లేవు - Sakshi

కొంభన్‌లో ప్రేమ సన్నివేశాలు లేవు

మెడ్రాస్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడంతో కొంభన్ చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

మెడ్రాస్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కావడంతో కొంభన్ చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అదే విధంగా వరుస విజయాల నటి లక్ష్మీమీనన్ కార్తీతో చేరడంతో సెంటిమెంట్‌గా కూడా కొంభన్ చిత్రం సక్సెస్‌పై నమ్మకం పెరుగుతోంది. కుట్టిపులి చిత్రం ఫేమ్ ముత్తయ్య దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న భారీ చిత్రం కొంభన్. సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగాచిత్ర దర్శకుడు ముత్తయ్యతో చిన్న ఇంటర్వ్యూ.
 
 ప్రశ్న: కొంభన్ కథేంటి?
 జవాబు: నా తొలిచిత్రం కుట్టిపులిని విరుదునగర్ నేపథ్యంలో తెరకెక్కించాను. ఈ కొంభన్ చిత్రాన్ని రామనాథపురం బ్యాక్ డ్రాప్‌లో రూపొందించాను. ఇది పూర్తిగా గ్రామీణ కథా చిత్రం. హీరో కార్తీ పేరు కొంభయ్య పాండియన్. అందువల్లే ఈ చిత్రానికి కొంభన్ అని పేరు నిర్ణయించాం. కార్తీ తండ్రి పేరు మలయప్ప పాండియన్. అయితే ఈ పాత్ర సినిమాలో ఉండరు. అమ్మ పేరు కొట్టైయమ్మన్. ఈ పాత్రలో కోవై సరళ జీవించారనే చెప్పాలి. ముత్తయ్యగా రాజ్‌కిరణ్ నటించారు. ఆయన కూతురు పళనియమ్మగా లక్ష్మీమీనన్ నటించారు. వీరి మధ్య జరిగే పాశ పోరాటమే కొంభన్ చిత్రం.
 
 ప్రశ్న: యథార్థ కథా చిత్రమా?
 జవాబు: అవును. నా తండ్రి, నా తాతకు మధ్య జరిగిన కొన్ని సంఘటనలతో ఈ చిత్ర కథను తయారు చేశాను. కార్తీ మేనమామగా తంబిరామయ్య ఆ పాత్రకు ప్రాణం పోశారు.
 
 ప్రశ్న: కార్తీ గురించి?
 జవాబు: పరుత్తివీరన్ చిత్రం తరువాత కార్తీ ఈ చిత్రంలో నేటివిటీ పాత్రను పోషించారు. చాలా సహజత్వంతో కూడిన పాత్ర. నిజ జీవితంలో ఎలా ఉంటారో ఈ చిత్రంలోను అలానే కనిపిస్తారు. ఈ పాత్ర కోసం చాలా శ్రద్ద తీసుకుని నటించారు.
 
 ప్రశ్న: కార్తీ, లక్ష్మీమీనన్‌ల మధ్య ప్రేమ సన్నివేశాలు గురించి?
 జవాబు: కొంభన్ చిత్రంలో భావోద్రేకాలు, అనుబంధాలు, ఆప్యాయతలు అంటూ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి గాని హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు ఉండవు. ఇది అలాంటి చిత్రం కాదు. సాధారణంగా చిత్రాలలో కథానాయికలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయితే ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ నటనకు అవకాశం ఉన్న పాత్ర. ఆమె కూడా పాత్రను అర్థం చేసుకుని నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement