ఉచితంగా ఉద్యోగం కల్పిస్తాం | free Employement opportunities by 4c it services | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఉద్యోగం కల్పిస్తాం

Published Fri, Jan 31 2014 12:32 PM | Last Updated on Thu, Sep 27 2018 8:48 PM

కృతిక శ్రీధర్ - Sakshi

కృతిక శ్రీధర్

 దైనందిన జీవితంలో అడుగడుగునా సవాళ్లే. విద్యార్థి దశలో మెరిట్‌లో పాసవడం ఒక సవాల్. పట్టభద్రులైన తరువాత నిరుద్యోగ జీవితాన్ని నెట్టుకురావడం మరో సవాల్. ఆ తరువాత తగిన ఉద్యోగం దక్కించుకోవడం ఇంకో సవాల్. దక్కిన ఉద్యోగాన్ని చివరివరకూ నిలుపుకోవడం, పదోన్నతులు పొందడం కూడా సవాలే. ఇలా సవాళ్లతో కూడుకున్న జీవితంలో తగిన ఉద్యోగాన్ని పొందడానికి తాము సహకరిస్తామంటున్నారు చెన్నైలోని ‘4సీ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’  డెరైక్టర్ కృతిక శ్రీధర్. అదీ పూర్తి ఉచితంగా తమ సేవలను అందిస్తున్నట్లు బుధవారం ‘సాక్షి’తో ఆమె చెప్పారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే...         - చెన్నై, సాక్షి ప్రతినిధి
 
 
''నేడు కళాశాలల నుంచి కుప్పలు తెప్పలుగా ఇంజనీరింగ్ పట్టభద్రులు, డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు తగిన ఉద్యోగాల్లేక వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక కంపెనీలు తగిన కోర్సులు పూర్తిచేసిన నిరుద్యోగుల కోసం వెతుకుతున్నాయి. ఇటు నిరుద్యోగులను, అటు సంస్థలను తమ సంస్థ అనుసంధానం చేస్తూ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాము. బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉపాధి కల్పనా రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండటంతో రెండేళ్ల క్రితం 4సీ ని స్థాపించాము. రిక్రూట్‌మెంట్, హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్ అనే రెండు విభాగాలు విభజించి ఇంజనీరింగ్, ఆర్ట్స్ ఆండ్ సైన్స్ విద్యార్థులకు సేవలందిస్తున్నాము. రిక్రూట్‌మెంట్‌లో ఐటీ, నాన్ ఐటీ కేటగిరీలను ఏర్పాటు చేశాం. బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ (బీపీఓ) కింద బీఈ, బీటెక్, ఎంబీఏ, ఆర్ట్స్ అండ్ సైన్స్, డిప్లొమో ఐటీ కింద జావా, డాట్‌నెట్, టెస్టింగ్, ఎస్‌ఏపీ, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులను ఉద్యోగాల కల్పనకు పరిగణనలోకి తీసుకుంటున్నాం. 
 
ఆయా కోర్సులు చేసినవారు జాబ్ పోర్టల్స్‌లో తమ దరఖాస్తును నమోదు చేసుకుంటారు. మా సంస్థ ఇప్పటికే జాబ్ పోర్టల్స్‌తో లాగిన్ అయి ఉంది. యాక్సెంచర్ సర్వీసెస్, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్, సీఎస్‌ఎస్ కార్ప్, టీవీఎస్ ఇన్ఫోటెక్, విలియమ్స్‌లీ, హెక్సీగన్ గ్లోబల్ తదితర సంస్థలతో మా సంస్థ ఉద్యోగాల కల్పనపై అనుసంధానమైంది. జాబ్‌పోర్టల్ ద్వారా నిరుద్యోగుల వివరాలను సేకరించి ఆయా విద్యార్హతలు కలిగిన వారి కోసం ఎదురుచూస్తున్న కంపెనీలకు సిఫార్సు చేస్తాము. అవసరమైన పక్షంలో నిరుద్యోగులను మేము ముందుగా ఇంటర్వ్యూ చేసి చురుకైన విద్యార్థులను పంపుతాము. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన కంపెనీలు మాకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నందున నిరుద్యోగుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనే ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదు. రెండేళ్లలో నాన్ ఐటీ సెక్టార్‌లో 300 మందికి, ఐటీ సెక్టార్‌లో 100 మందికి ఉచితం ఉపాధి కల్పించారు.  
 
కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం
ఉన్నత చదువులు చదువుకోవడం వేరు, ఆ విద్యార్హతతో ఉద్యోగం పొందడం వేరు. ఆంగ్లభాషపై పట్టు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ లేకుంటే ఎంత పెద్ద చదువు ఉన్నా వ్యర్థమే. ఉద్యోగం కోసం దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధపడటం నేటి యువతకు ఎంతో అవసరం. ఐటీ కేటగిరి ఉద్యోగాల్లో అన్ని కంపెనీల వారు అనుభవం అడుగుతున్నారు. అదే బీపీవో కేటగిరిలో అనుభవం లేనివారికి సైతం ఎక్కువ ఉద్యోగాలు ఉన్నారుు. ఒకరికి ఉద్యోగం ఇప్పించడం అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం వంటిది. అందులో ఎనలేని తృప్తి మాకు కలుగుతోంది. 2013లో మా సంస్థ ప్రభుత్వ ప్రాజెక్టును పొందగా, తద్వారా రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్ విద్యనభ్యసించిన 400 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించాం. మా ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో కొందరు నేరుగా వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. దీని ద్వారా తమ కంపెనీకి సార్థకత చేకూరినట్లుగా భావిస్తున్నాం. కేవలం జాబ్‌పోర్టల్స్ ద్వారా మాత్రమే కాదు నేరుగా మమ్మల్ని సంప్రందించినా ఉచిత సేవలు పొందవచ్చు. 044-49072201-210 (పదిలైన్ల) ద్వారా నిరుద్యోగులు సంప్రదించవచ్చు'' అని 4సీ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ డెరైక్టర్ కృతిక శ్రీధర్ తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement