
నర్సుతో అసభ్య ప్రవర్తన.. డాక్టర్ అరెస్ట్
తిరువొత్తియూరు: చెన్నై అంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుతో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంబత్తూరు, కొరటూరు రైల్వేస్టేషన్ రోడ్డులో ప్రైవేటు ఆసుపత్రిలో వేలూరు జిల్లా వాళైపందల్ గ్రామానికి చెందిన సుకన్య (24) నర్సుగా పని చేస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో మారిముత్తు (31) డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో ఇటీవల ఆసుపత్రిలో సుకన్య, మారిముత్తు రాత్రి డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో సుకన్యను మారిముత్తు అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన మారిముత్తు సుకన్య చెంప మీద కొట్టి బెదిరించాడు. దీంతో సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ బాలమురళి డాక్టర్ మారిముత్తును అరెస్టు చేసి అంబత్తూరు కోర్టులో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు.