శశికళ వర్సెస్ శశికళ వివాదంలో మరో ట్విస్ట్ | ec seeks explanation on AIADMK general secretary Sasikala elect | Sakshi

శశికళ వర్సెస్ శశికళ వివాదంలో మరో ట్విస్ట్

Feb 4 2017 4:18 PM | Updated on Sep 5 2017 2:54 AM

శశికళ వర్సెస్ శశికళ వివాదంలో మరో ట్విస్ట్

శశికళ వర్సెస్ శశికళ వివాదంలో మరో ట్విస్ట్

తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్, ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్పల వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్, ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్పల వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నిక చెల్లదంటూ పుష్ప చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని అన్నా డీఎంకేను ఈసీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కావాలని పావులు కదుపుతున్న శశికళ నటరాజన్కు ఇది ఊహించని పరిణామం.  

జయలలిత అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆమె స్థానంలో తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆమె నెచ్చెలి శశికళ నటరాజన్ను ఎన్నుకున్నారు. జయలలిత మరణం తర్వాత పుష్ప.. శశికళ నటరాజన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులతో పాటు ఈసీని ఆశ్రయించి ఆమెపై పోరాడుతున్నారు.  జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, జయలలిత చుట్టూ జరిగిన అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని ఆరోపిస్తూ, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా, కోర్టు దాన్ని కొట్టేసింది. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్‌ అర్హురాలు కాదని, ఆమె ఎన్నికను సవాల్‌ చేస్తూ పుష్ప ఈసీని ఆశ్రయించారు.  

సంబంధిత వార్తలు చదవండి

చిన్నమ్మకు షాక్!

జయలలిత.. ఇద్దరు శశికళలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement