కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
పాల్వంచ : కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాల్వంచ శాస్త్రిరోడ్డు సమీపంలో ఉన్న వెంకటేశ్వర ఏజెన్సీ డిస్ట్రిబ్యూషన్ దుకాణంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో షాపులోని సరుకులు భారీగా దహనమయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ఫైర్ అధికారులు రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు షాపు యజమాని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.