
హంపి ఉత్సవాల్లో నేటి కార్యక్రమాలు
హొస్పేట : హంపి ఉత్సవంలో భాగంగా మూడో రోజు ఆదివారం వివిధ వేదికలపై జరుగనున్న సంగీత, సాంస్కృతిక, నృత్య ప్రదర్శన తదితర కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
శ్రీకృష్ణదే వరాయ వేదికపై...
ఆదివారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు సిరుగుప్ప చిదానంద రారావి ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 5.30 నుంచి 6 గంటల వరకు సండూరు ఉమేష్‌కే ఆధ్వర్యంలో తబల జుగల్బందీ, 6 నుంచి 7 గంటల వరకు హొస్పేట శరణ బసవ ఒకార బృందం ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం, నాడగీత రైతు గీతాలు, 7నుంచి 8.30 గంటల వరకు ముంబయి రిచాశర్మ ఆధ్వర్యంలో గీత గాయన, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు తంజావూరు దక్షిణజోన్ సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జానపద నృత్యం, రాత్రి 9.30 ముంబయి వికాస్‌సింగ్ ఆధ్వర్యం రసమంజరి జరగనుంది.
ఎంపీ ప్రకాష్ వేదికపై...
సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు కోలారు పిచ్చళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జానపద గీతాలు, 6 నుంచి 6.45 గంటల వరకు బెంగళూరు రాధికా నందకుమార్ బృందం ఆధ్వర్యంలో నృత్య రూపకం, 6.45 నుంచి 7.40 గంటల వరకు ధార్వాడ కైవల్యకుమార్ ఆధ్వర్యంలో హిందుస్థానీ సంగీతం, 7.30 నుంచి 8 గంటల వరకు బెంగళూరు విద్వాన్ టీఎస్ మణి బృందం ఆధ్వర్యంలో తాళ వాయిద్య ఫ్యూజియన్, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు నాగపూర్ దక్షిణ కేంద్రం విభాగం సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జానపద నృత్యం, 9 నుంచి 10 గంటల వరకు బెంగళూరు పింక్ ఫ్లవర్స్ ఆధ్వర్యంలో సాంప్రదాయ అన్వేషణ ప్రదర్శన, 10 నుంచి 10.30 గంటల వరకు మంగళూరు హెజ్జనాథ ఆధ్వర్యంలో దుర్గాశక్తి నృత్య రూపకం, 10.30 నుంచి 11.15 బెంగళూరు బాబు పద్మనాభ ఆధ్వర్యంలో వేణు వాదన, 11.15 నుంచి 11.40 గంటల వరకు బెంగళూరు డాక్టర్ సువర్ణ రవిశంకర్ ఆధ్వర్యంలో వీణా వాదన, 11.40 నుంచి 12 గంటల వరకు సండూరు సహన ఆధ్వర్యంలో సుగమ సంగీతం ఉంటుంది.
విద్యారణ్య వేదికపై...
సాయంత్రం 5.30 నుంచి 5.50 గంటల వరకు హావేరి బసవరాజ తిరుకప్ప భజంత్రీ ఆధ్వర్యంలో షహనాయి వాదన, 5.50 నుంచి 6.20 గంటల వరకు రాయచూరు అంబయ్యనులి ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 6.20 నుంచి 6.45 గంటల వరకు బేళూరు శివణ్ణ బృందం ఆధ్వర్యంలో జానపద గీతాలు, 6.45 నుంచి 7.15 గంటల వరకు బెంగళూరు జయశ్రీ రవి బృందం ఆధ్వర్యంలో నృత్య రూపకం, 7.15 నుంచి 7.35 గంటల వరకు కూడ్లిగి అనురాధ ఆధ్వర్యంలో దాసర పదాలు, 7.35 నుంచి 8 గంటల వరకు బళ్లారి దొడ్డయ్య వి.కల్లూరు ఆధ్వర్యంలో వచన సంగీతం, రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు గంగావతి రాఘవేంద్ర హెచ్‌ఏ ఆధ్వర్యంలో సామూహిక నృత్యం, 6.30 నుంచి 8.50 గంటల వరకు ధార్వాడ శివకుమార్ పాటిల్ ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 8.50 నుంచి 9.15 గంటల వరకు రాణి బెన్నూరు కేసీ నాగ రజిని బృందం ఆధ్వర్యంలో జానపద గీతాలు, 9.15 నుంచి 10 గంటల వరకు బళ్లారి శివశంకర నాయుడు ఆధ్వర్యంలో హాస్య నాటకం, 10 నుంచి 10.20 గంటల వరకు హగరిబొమ్మనహళ్లి కె.శారద ఆధ్వర్యంలో వచన గాయన, 10.20 నుంచి 10.45 గంటల వరకు బళ్లారి ఎం.నాగభూషణ బాపురే ఆధ్వర్యంలో హిందుస్థానీ సంగీతం, 10.45 నుంచి 11.15 గంటల వరకు బెంగళూరు హెచ్.ఫల్గుణ ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 11.15 నుంచి 11.30 గంటల వరకు కొప్పళ హనుమంత నరేగల్ ఆధ్వర్యంలో భావగీతాలు, 11.30 నుంచి 12.30 గంటల వరకు మరియమ్మనహళ్లి లలిత కళాబళగ బృందం ఆధ్వర్యంలో చారిత్రక నాటక ప్రదర్శన ఉంటుంది.
బుర్రకథ దరోజీ ఈరమ్మ వేదికపై...
సాయంత్రం 5.30 నుంచి 5.50 గంటల వరకు హడగలి హుగ్గి రుద్రమ్మ ఆధ్వర్యంలో సాంప్రదాయ పాటలు, 5.50 నుంచి 6.10 గంటల వరకు హొస్పేట బి.మారెప్ప ఆధ్వర్యంలో బుర్రకథ, 6.10 నుంచి 6.20 గంటల వరకు కంప్లి రాహుల్ నాగప్ప బృందం ఆధ్వర్యంలో రాజన కుణిత, 6.20 నుంచి 6.40 గంటల వరకు మడికేరి ఏవీ షడాక్షరి బృందం ఆధ్వర్యంలో జానపద గీతాలు, 6.40 నుంచి 7.30 గంటల వరకు బళ్లారి రామాంజినేయ తోలుబొమ్మలాట మేళ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోలుబొమ్మలాట, 7.30 నుంచి 7.50 గంటల వరకు కొప్పళ గుండూరు ఉసేన్‌సాబ్ ఆధ్వర్యంలో రంగగీతాలు, 7.50 నుంచి 8.15 గంటల వరకు బాగలకోట విఠల్ బలవంతరావు పుత్తూర సింధె ఆధ్వర్యంలో రివాయత్ పాటలు, రాత్రి 8.15 నుంచి 8.30 గంటల వరకు టీబీడ్యాం కన్నడ కళా సంఘం ఆధ్వర్యంలో హాస్య నాటకం ఆహా..నన్న మదువె అంతే, 9.30 నుంచి 10.30 గంటల వరకు బళ్లారి అభినవ కేంద్రం ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన, 10.30 నుంచి 12 గంటల వరకు మల్పనగుడి మల్లికార్జున నాట్య కళా సంఘం ఆధ్వర్యంలో పౌరాణిక నాటక రక్తనాటకం ఉంటుంది.
హక్కబుక్క వేదికపై...
సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు హొస్పేట కృష్ణప్ప ఎం.జోగి ఆధ్వర్యంలో సుగమ సంగీతం, 6.30 నుంచి 7 గంటల వరకు బళ్లారి నవజీవన వికలాంగుల పాఠశాల ఆధ్వర్యంలో సమూహ నృత్యం, 7 నుంచి 7.45 గంటల వరకు బళ్లారి బీఎం వీరభద్రయ్య ఆధ్వర్యంలో హిందుస్థానీ సంగీతం, 7.45 నుంచి 8.15 గంటల వరకు బళ్లారి ప్రభుత్వ చెవిటి విద్యార్థుల ఆధ్వర్యంలో సామూహిక నృత్యాలు, రాత్రి 8.15 నుంచి 9 గంటల వరకు తిమ్మలాపురం హనుమయ్య ఆధ్వర్యంలో జానపద గీతాలు, 9 నుంచి 10 గంటల వరకు హగరి బొమ్మనహళ్లి కుబేంద్రశాస్త్రీ ఆధ్వర్యంలో కథకేతన ఉంటుంది.