జోహార్ అంబేద్కర్
Published Tue, Apr 15 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 123వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ సేవలను కీర్తిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడైన అంబేద్కర్ అందరికీ ఆదర్శమని వివరించారు. చెన్నై నగరంలోనూ అంబేద్కర్ జయంతి కోలాహలంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అదే విధంగా టామ్స్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చెన్నై పట్టినపాక్కంలోని మనిమండపంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టామ్స్ అధ్యక్షుడు ఇజ్రాయేల్, ప్రధాన కార్యదర్శి ఎన్.విజయకుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆశీర్వాదం, టామ్స్ స్టేట్ సెక్రటరీ బి.ఎన్.బాలాజీ, ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ జి.పి.నాగూర్, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, రచయిత ప్రణవి, పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర కార్యదర్శి ఎల్.సుందరం పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగుల ఆధ్వర్యంలో...
చెన్నై కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నై, హార్బర్‌లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సం ఘం అధ్యక్షుడు జెపి నాగభూషణంతోపాటు కేసీ కొండ య్య, గోపి, వేణు, హజరత్ దేవదానం తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ 123వ జయంతి వేడుకల్లో అధ్యక్షుడు ఆదిశేషయ్య, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ద్రావిడ దేశం ఆధ్వర్యంలో చెన్నైలోని హార్బర్‌లో జరిగిన కార్యక్రమంలో ద్రవిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు పాల్గొన్నారు.
అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం
తిరువళ్లూరు: ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరన్మరణీయమని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆవడిలోని రామలిం గాపురం తెలుగు కాలనీలో ఫ్రెండ్స్ ఆఫ్ లవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు దేవయ్య, డేవిడ్, రవి, ఆంటోని, బాబు, భాస్కర్ పాల్గొన్నారు. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమంలో పీబీకే నేతలు మహ, శ్రీధ ర్, సీపీకుమార్‌తో పాటు పలువురు పీబీకే నేతలు హాజరయ్యారు. అదే విధంగా వీసీకే ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదట ఊరేగింపుగా వెళ్లిన నేతలు, ఆయిల్‌మిల్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దళపతి సుందరం, సిద్దార్‌థతోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. దీం తో పాటు బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు,పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.
Advertisement