ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించడాన్ని తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చెప్పారు. బుధవారం నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఆయన అధికారిక నివాసం కృష్ణాలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఇచ్చిన సలహాలను కచ్చితంగా పాటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై బుధవారం ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హాట్ స్పాట్లలో మరింత పకడ్బందీ చేస్తామన్నారు.
ఏడు సూత్రాలను పాటిద్దాం
ప్రధాని చెప్పిన ఏడు సూత్రాలను ప్రతిఒక్కరూ పాటించాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, ఇంట్లోనే మాస్కులను సిద్ధం చే సుకోవడం, వలస కార్మికులు ఎక్కడున్నారో అక్కడే మరికొద్ది కాలం ఉండడం, నిత్యావసర వస్తువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడం వంటి వాటిని మరింత నిబద్ధతతో అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లఘించిన 57,633 వాహనాలను సీజ్ చేసినట్లు, 2,185 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. సుమారు రూ. 95 లక్షల జరిమానాలను వసూలు చేసినట్లు తెలిపారు.
మరో 3 ప్రాంతాల్లో సీల్‌డౌన్
శివాజీనగర: కరోనా వైరస్ బాధితులు పెద్దసంఖ్యలో బయటపడడంతో ఇతరులకు సోకకుండా నగరంలో పాదరాయనపుర, బాపూజీనగరతో పాటు మరో 3 ప్రదేశాలను సీల్‌డౌన్ చేయడం తెలిసిందే. ఈశాన్య విభాగంలో విద్యారణ్యపుర, మారుతినగర, కొడిగేహళ్ళి గేట్ ప్రదేశాలను పూర్తిగా సీల్ డౌన్ చేసి వాహనాలు, జన సంచారాన్ని నిషేధించారు. విద్యారణ్యపుర, మారుతీనగర, కొడిగేహళ్ళి గేట్ ప్రదేశాల్లో సుమారు 119 రోడ్లను పూర్తిగా బంద్ చేశారు. మూడు ప్రదేశాల ప్రజలు బయటికి రాకూడదని ఆదేశించారు. పెద్దసంఖ్యలో పోలీసులను నియమించారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలతో పాటు అవసరమైన వస్తువుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు. సీల్‌డౌన్‌లు త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశమున్నట్లు సమాచార
Comments
Please login to add a commentAdd a comment