
వందేమాతరంపై సంచలన తీర్పు..
చెన్నై: జాతీయ గేయం వందేమాతరంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గేయం వందేమాతరాన్ని అందరూ పాడాల్సిందేనని తీర్పునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా జాతీయ గేయాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. వారంలో అది కూడా సోమ, శుక్రవారల్లో ఒకసారైనా పాడాలని తెలిపింది. ఈ మేరకు తీర్పునిస్తూ జస్టిస్ ఎంవీ మురళీధరణ్ తీర్పునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో వారానికి ఒకసారి, ప్రభుత్వ ప్రవేటు కార్యాలయ్యాల్లో నెలకోసారైన జాతీయ గేయాన్ని పాడాలన్నారు. బెంగాళీ, సంస్కృతం కఠినంగా ఉంటే తమిళంలోకి తర్జుమా చేసుకొని పాడాలని సూచించారు. ఒక వ్యక్తిలేదా, వ్యవస్థ పాడకుండా ఉంటే దానికి ఏదైనా బలమైన కారణం చూపించాలని జస్టిస్ మురళీధరణ్ పేర్కొన్నారు.