సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఎస్‌బీఐ బ్రాంచిలో గతేడాది చోరీ జరిగింది. సుమారు రూ.42 వేలు నగదును దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు అనుకాన్ సబర్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పాలకొండలో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. నిందితుడు ఒడిశాకు చెందిన వ్యక్తి అని తెలిపారు.
ఈ చోరీలో మొత్తం 9 మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇటీవల ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఇప్పుడు ప్రధాన నిందితుడిని పట్టుకున్నామన్నారు. దొంగతనానికి వినియోగించిన కారును, వాడిన సామగ్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. గతేడాది డిసెంబర్ 22న చోరీ జరగగా.. సీసీపుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.