సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన మండలాలకు మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టులను మంజూరు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కొత్త మండలాలకి ఒక పోస్టును సృష్టించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు ఫైలు పంపించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని గ్రామాలు పక్క మండలాలకు, పక్క జిల్లాలకు వెళ్లిపోవడంతో 125 వరకు కొత్త మండలాల్లో ఎంఈవో పోస్టులు అవసరమయ్యాయి.
ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించగానే ఈ పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అయితే సర్వీసు రూల్స్ సమస్య ఉన్న కారణంగా వాటిని రెగ్యులర్‌గా భర్తీ చేసే అవకాశం లేనందునా, ఇన్‌ఛార్జి ఎంఈవోలుగా ఆయా మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలలకు చెందిన సీనియర్ హెడ్ మాస్టర్లకు బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటీ రెండు రోజుల్లో వె లువడే అవకాశం ఉంది.
కొత్త మండలాలకు ఎంఈవో పోస్టులు
Published Fri, Oct 14 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement