'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి' | mm pallam raju takes on tdp leaders | Sakshi
Sakshi News home page

'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి'

Published Thu, Sep 1 2016 12:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి' - Sakshi

'పవన్ కల్యాణ్ అవగాహన చేసుకుని మాట్లాడాలి'

కాకినాడ : ఓటుకు కోట్లు కేసులో విచారణ చేసి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పల్లంరాజు గురువారం కాకినాడలో డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. అందుకే హైదరాబాద్ వెళ్లడానికి భయపడుతున్నారని ఆయన టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ ఎటువంటి కృషి చేస్తుందో అవగాహన చేసుకుని మాట్లాడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు పల్లంరాజు సూచించారు.

తన తండ్రి, కేంద్ర మాజీమంత్రి ఎం.రామ సంజీవరావు జ్ఞాపకార్థం కాకినాడలోని జేఎన్టీయూలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి ప్రవళికకు శుక్రవారం గోల్డ్మెడల్ ప్రదానం చేయనున్నట్లు పల్లంరాజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ కౌర్ హాజరవుతారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement