'టీడీపీ నిర్వాకం వల‍్లే భీమా రాలేదు' | mp avinash reddy slams ap government over Crop Insurance | Sakshi
Sakshi News home page

'టీడీపీ నిర్వాకం వల‍్లే భీమా రాలేదు'

Published Thu, May 25 2017 11:53 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ సర్కార్‌ నిర్వాకం వల్లే 2012 సంవత‍్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ‍్ము రాలేదని కడప పార‍్లమెంట్‌ సభ‍్యుడు అవినాష్‌రెడ్డి ఆరోపించారు.

కడప: టీడీపీ సర్కార్‌ నిర్వాకం వల్లే 2012 సంవత‍్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ‍్ము రాలేదని కడప పార‍్లమెంట్‌ సభ‍్యుడు అవినాష్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంలో ఏపీ ప్రభుత‍్వం తాత్సారం చేసినందువల‍్లే రైతులకు రావాల్సిన పంటల భీమా నగదు విడుదల కాలేదని చెప్పారు. ఫలితంగా రైతులు చాలా ఇబ‍్బందులు పడుతున్నారన‍్నారు. ఇప‍్పటికైనా ప్రభుత‍్వం స‍్పందించి కేంద్రానికి వెంటనే లేఖ రాసి 2012 సంవత‍్సరానికి రావాల్సిన పంటల భీమా సొమ‍్ము వచ్చేలా చర‍్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement