సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు | MS Subbulakshmi's 'Vishnu Sahasranamam' blocked on YouTube | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు

Published Thu, Jan 14 2016 10:34 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు - Sakshi

సోషల్ మీడియాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల తొలగింపు

చెన్నై: సోషల్‌ మీడియా నుంచి ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను తొలగించడంతో కర్ణాటక సంగీత ప్రియులు అసంతృప్తికి గురవుతున్నారు. మార్గశిర మాసం అంటేనే కర్ణాక సంగీత ప్రియులకు అంత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ నెలలో పలు కర్ణాటక సంగీతోత్సవాలు నిర్వహిస్తుంటారు.

 

అలాంటి కర్ణాటక సంగీతంలో ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఎంఎస్.సుబ్బలక్ష్మి పాటలను సోషల్ మీడియాలో ఆలకించాలని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. యూట్యూబ్ నుంచి సుబ్బలక్ష్మి విష్ణు సహస్రనామం గీతాన్ని తొలగించారు. ఆ గీతాల హక్కులను పొందిన ఆడియో సంస్థ ఆ సహస్రనామ గీతాన్ని తొలగించడం కర్ణాటక సంగీత ప్రియులను నిరాశకు గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement