‘కుక్కపిల్ల... సబ్బుబిళ్ల... అగ్గిపుల్ల...కాదేదీ కవితకు అనర్హం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఫేస్‌బుక్, వాట్సాన్, యూట్యూబ్, ట్విట్టర్... కాదేదీ ప్రచారానికి అనర్హం అంటున్నారు నేటి నాయకులు. యువ ఓటర్ నాడిని పట్టేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.నేటి తరం ప్రచార వేదికగా నిలిచిన సామాజిక ప్రసార మాద్యమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎప్పుడూ ‘ఆన్‌లైన్’లోనే ఉండే ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు.
అన్ని వర్గాలకు అనుగుణంగా...
ఎన్నికల్లో యువతను ఆకట్టుకుని వారి ఓట్లను కొల్లగొట్టి విజయం సాధించాలనుకుంటున్న అభ్యర్థులు తమ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. పట్టణ వాసులు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు...ఇలా ఎవరినీ వదలకుండా తమ ప్రచార వ్యూహాన్ని రచించుకుంటున్నారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లతో నేటి యువత సోషల్ నెట్‌వర్క్ సైట్లను అధికంగా ఉపయోగిస్తుండటంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సెల్‌ఫోన్లలో యువత అత్యధికంగా ఉపయోగించే ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ అప్లికేషన్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
మొబైల్స్ ద్వారా ప్రచారం...
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు సైతం స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగిస్తున్నారు. పట్టణాల్లో ఉంటున్న విద్యార్థులు, యువత, గృహిణులు కూడా మొబైల్స్ వాడుతున్నారు. జిల్లాలో దాదాపు 3 లక్షలకు పైగా సోషల్ మీడియా సైట్లలో అకౌంట్లు ఉన్నట్లు సమాచారం.
దీన్నే అభ్యర్థులు ప్రధాన ప్రచార అస్త్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ప్రచారం నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రచారంలో కొత్త పుంతలు
Published Thu, Apr 17 2014 3:55 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement