
‘కాపులతో చంద్రబాబు మైండ్ గేమ్’
ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ఉద్యమం ఆగదని కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు.
కిర్లంపూడి: ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ఉద్యమం ఆగదని కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు జాతితో చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఉద్యమం ప్రారంభం నాటి నుంచి తమ అనుకూల పత్రిక, చానళ్ల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేక వార్తలు రాయిస్తోందని అన్నారు.
తనను దూషించడానికి కొంత మంది పెద్దల్ని, కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఒక కులాన్ని అదే కులస్తులతో తిట్టించిన ఘటనలు దేశంలో ఎక్కడా లేవని వాపోయారు. ఉద్యమంలో కాపు కులస్తులు అలసిపోతున్నారని, మరికొంత వారి బంధువుల వ్యాపారాల వల్ల ప్రభుత్వంలో చేరుతున్నారని వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమం కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు.