ఉలిక్కిపడ్డ చెన్నై | Multi-storey Chennai building collapses; several feared trapped | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డ చెన్నై

Published Sun, Jun 29 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

ఉలిక్కిపడ్డ చెన్నై

ఉలిక్కిపడ్డ చెన్నై

సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని చెన్నై శివారులోని పోరూరు మౌళివాక్కంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర దుర్ఘటన ప్రజానీకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంత పెద్ద భవనం కుప్పకూలడమన్నది ఇదే ప్రప్రథమంగా కావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా రు. కళ్లెదుటే భారీ భవనం కుప్పకూలుతుండడాన్ని చూసిన మౌలివాక్కం పరిసరాల్లోని నిర్వాసితులు ఒక్కసారిగా ఆందోళనలో పడ్డారు. తమవాళ్లకేమైం దంటే తమవాళ్లకేమైందంటూ జాడ కోసం రోదిస్తూ కొందరు, శిథిలాల కింద తమ వాళ్లు సురక్షితంగా ఉండాలంటూ ప్రార్థనలు చేస్తూ కొందరు గడిపారు.  
 
 చెన్నై మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తూ పోతున్నది. పోరూరు సమీపంలోని మౌళివాక్కం కూడా అదే బాటలో పయనిస్తోంది. శనివారం నాటి సంఘటన ఇందుకు తర్పణం పడుతోంది. రెండేళ్ల వ్యవధిలో రెండు 11 అంత స్తులతో కూడిన రెండు బహుళ భవనాలను ట్రస్టు హైట్స్ సంస్థ నిర్మించేసింది. ఈ భవనంలో గత కొద్ది రోజుల వరకు సుమారు 200 మంది వరకు పని చేస్తూ వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య తగ్గిందంటూ ఓ కార్మికుడు పేర్కొన్నాడు. భవనం కుప్పకూలుతున్న సమయంలో 11వ అంతస్తుడు ఉన్న ఓ యువకుడు అదృష్టం కొద్దీ క్షేమంగా బయటపడ్డాడు. జరిగిన ప్రత్యక్ష ఘటనను  అతను మీడియాకు వివరిస్తుంటే ఆ పరిసరవాసులు ఆందోళనకు లోనుకావాల్సి పరిస్థితి.
 
 ఉలికిపాటు
 ప్రశాంతతకు నిలయంగా ఉండే చెన్నై మహానగర వాసులు ఇటీవల కాలంగా ఉలిక్కిపడుతున్నారు. తీవ్రవాదుల హెచ్చరికలు ఓ వైపు, రైలు ప్రమాదాలు మరో వైపు, షావుకారుపేటలో మరో వైపు ప్రజలను భయకంపితులను చేశాయి. తాజాగా బహుళ అంతస్తుల భవనాలంటే ఆమడ దూరం పరుగులు పెట్టే స్థితి ఏర్పడింది. తాజా ఘటన ప్రజలను ఉలిక్కిపడేలా చేయడంతోపాటుగా ఈ పరిణామాలు ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టిస్తాయోనన్న ఆందోళనను రేకెత్తిస్తోంది. లక్షలు పోసి కొనుక్కున్న ఫ్లాట్లు నాణ్యతా లోపాలతో ఎక్కడ కుప్పకూలుతాయోనన్న భయం నిర్వాసితుల్లో నెలకొంటోంది.
 
 ఆర్తనాదాలు
 మౌళివాక్కంలో శనివారం రాత్రి  ఆర్తనాదాలు మిన్నంటాయి. బహుళ  అంతస్తుల భవనం కూలిన సమాచారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తే మహానగరంలోని కూలీ కార్మికుల్లో వేదనను రగిలించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కొందరు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కొందరు ఈ శిబిరాల కింద చిక్కుకున్నారన్న సమాచారం చెన్నైలో కూలిపనులు చేసుకుంటున్న ఆ ప్రాంత వాసుల్ని ఆందోళనలో పడేసింది. తమ ప్రాంతానికి చెందినవారేమైనా ఉన్నారా అని వాకబుచేయడానికి కొందరు పరుగులు తీస్తే, మరి కొందరు సంబంధిత నిర్మాణ సంస్థలో తమ వారు పని చేస్తున్నారని ఆవేదనలో పడ్డారు. తమ వారి జాడ కానరాకపోవడంతో ఆందోళనలో పడ్డవారు, కొందరైతే, కన్నీటి పర్యంతంతో విలపిం చారు. మరి కొందరు తమ వారి జాడ ఎక్కడ అని పరుగులు తీసినా పోలీసులు ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు.
 
 ముమ్మరంగా పనులు
 రెస్క్యూ ఆపరేషన్ మొదలు కాగానే, పదవ అంతస్తు కూలిన ప్రదేశం నుంచి వచ్చిన హాహాకారాలతో రెస్క్యూ టీమ్ చాకచక్యంగా వ్యవహరించింది. ఓ వ్యక్తిని సురక్షితంగా అక్కడి నుంచి రక్షించారు. భారీ క్రేన్‌లు, వెల్డింగ్ మిషన్లు, ఫ్లడ్ లైట్‌లను హుటాహుటిన ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసి ఆపరేషన్‌ను తీవ్రతరం చేశారు. కాంచీపురం జిల్లా కలెక్టర్ భాస్కరన్, రాష్ట్ర మంత్రి చిన్నయ్యలు సంఘటనా స్థలంలోనే తిష్టవేసి రెస్క్యూను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలో రెండు ప్రత్యేక వైద్య బృందాలు, రామచంద్ర ఆస్పత్రి బృందం ఒకటి సంఘటనా స్థలంలో తిష్ట వేసి క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించే పనుల్లో నిమగ్నమైంది. ఆరోగ్య శాఖ డెరైక్టర్ గీతాలక్ష్మీ మాట్లాడుతూ వైద్యపరంగా సర్వం సిద్ధం చేశామని వివరించారు.  
 వేగవంతం చేయండి బహుళ అంతస్థుల భవనం కూలిన సమాచారంతో సీఎం జయలలిత అధికారులకు ఆదేశాలిచ్చారు. సేవా కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచిం చారు.
 
 గవర్నర్ రోశయ్య దిగ్భ్రాంతి:
 ప్రమాద ఘటనై గవర్నర్ కొణిజేటి రోశయ్య దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. భవన శిథిలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉండటం బాధాకరమన్నారు.
 
 అదుపులోకి నిర్వాహకులు
 ప్రమాద ఘటనపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. ట్రస్టు హైట్స్ సంస్థ నిర్వాహకులు ముత్తు, మనోహరన్‌ను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. రె వెన్యూ, పోలీసు అధికారులు ప్రధానంగా భవనం నాణ్యత, పరిణామాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement