సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉద్యమాలతోనే ఓబీసీల సంక్షేమం, సమగ్రాభివృద్ధి జరుగుతుందని అఖిల భారత బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ పేర్కొన్నా రు.
ఏపీభవన్‌లోని గురజాడ సమావేశమంది రం లో నిర్వహించిన సమావేశంలో భాగంగా సంఘం జాతీయ కార్యకవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యుల వివరాలను జాతీయ బీసీ కమిషన్‌చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య,సభ్యులు ఎస్‌కే కార్వెంతన్ వెల్లడించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పూలే కలలుగన్న సమన్యాయం కోసం ఓబీసీలు ఉద్యమించాలన్నారు.
ఓబీసీ కార్యవర్గాలు సైతం రాజ్యాధికారం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల(ఓబీసీ) సంక్షే మ సంఘం ప్రధానకార్యదర్శి పి.మురళి పాల్గొన్నారు.