కాష్మోరాలో కార్తీతో నయన | Nayantara In Karthi's Next? | Sakshi
Sakshi News home page

కాష్మోరాలో కార్తీతో నయన

Published Thu, Nov 6 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

కాష్మోరాలో కార్తీతో నయన

కాష్మోరాలో కార్తీతో నయన

మెడ్రాస్ చిత్రం హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకొచ్చిన నటుడు కార్తీ. రీ ఎంట్రీలోనూ సక్సెస్ బాటలో నడుస్తున్న నటి నయనతార. ఈ క్రేజీ జంటతో ఒక చిత్రం వస్తే బాగుంటుంది కదూ. అయితే త్వరలో వీరిద్దరూ కలిసి కాష్మోరా అంటూ తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ టాక్.  మెడ్రాస్ విజయోత్సా హంతో ఉన్న కార్తీ ఇదర్కుదానే ఆశై పట్టాయ్ బాల కుమార చిత్రం ఫేమ్ గోకుల్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ చిత్రానికి కాష్మోరా అనే టైటిల్‌ను కూడా నిర్ణయించేశారు.
 
 అయితే ఈ చిత్రంలో కార్తీతో రొమాన్స్ చేయడానికి నటి శ్రుతిహాసన్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ విషయం అటుంచితే చిత్ర దర్శక నిర్మాతలు సంచలన నటి నయనతారపై మొగ్గు చూపుతున్నారని తెలిసింది. వరుస విజయాలతో జోరు మీదున్న నయనతారకు కథ వినిపించగా బాగా ఇంప్రెస్ అయిపోయి ఈ బ్యూటీ కూడా ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పినట్లు కోలీవుడ్ టాక్. ముఖ్యపాత్రలో పశుపతి, హాస్య పాత్రలో వడివేలు నటించనున్నారని తెలిసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement