భువనగిరి ఆర్టీవో ఆఫీసుకు నయీం బాధితులు శనివారం భారీగా చేరుకున్నారు.
నల్గొండ : భువనగిరి ఆర్టీవో ఆఫీసుకు నయీం బాధితులు శనివారం భారీగా చేరుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి వెంచర్లోని తమ ప్లాట్లను కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీనిపై మరికాసేపట్లో ఆర్టీవో విచారణ జరపనున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడు అక్రమాలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
దాంతో నయీం తమను బెదిరించి లక్ష్మీనరసింహస్వామి వెంచర్లోని తమ ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో ఆర్టీవో విచారణ చేపట్టనున్నారు.