సాక్షి, బెంగళూరు : ‘రాజకీయంగా విశ్రాంతి తీసుకునే స్థితిలో ఉన్నా. అందువల్ల నేను మంత్రి పదవులు ఆశించడం లేదు. ప్రస్తుతం ఉన్న స్పీకర్ పదవితో సంతోషంగా ఉన్నాను.’ అని స్పీకర్ కాగోడు తిమ్మప్ప పేర్కొన్నారు. విధానసౌధాలో గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎన్నో పదువులను అనుభవించానన్నారు.
అందువల్ల ప్రస్తుతం మంత్రి పదవి కోసం ఎవరినీ సంప్రదించే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో బగర్‌హుకుం భూముల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసినట్లు చెప్పారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప చాలా అదృష్టవంతుడని, ఇలా ఎందుకు వాఖ్యానించానో ఇప్పుడే చెప్పబోనని పేర్కొన్నారు.
రాజకీయ చరమాంకంలో ఉన్నా...
Published Thu, Sep 4 2014 2:59 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement