
'ఈ ఏడాది కొత్త మద్యం షాపులుండవ్'
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఈ ఏడాది కొత్తగా మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటివరకూ ఉన్నటువంటి మద్యం షాపుల విషయంలోనూ స్థానికంగా ఉన్న మొహల్లా సభ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్.. మొహల్లా సభలో స్థానికంగా మద్యం షాపు ఉండకూడదని తీర్మానం చేస్తే దానిని వేరే చోటుకి తరలిస్తామని వెల్లడించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కనీస వేతనాలను పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేజ్రీవాల్ అన్నారు. అంబానీ, అదానీల వద్ద కాకుండా.. పేద, మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బుంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందన్నారు.