డీయూలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు | Now forensic sciences course in DU | Sakshi
Sakshi News home page

డీయూలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు

Published Tue, Jun 10 2014 11:38 PM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

డీయూలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు - Sakshi

డీయూలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు

 న్యూఢిల్లీ: ఇకపై ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లోనూ ఫోరెన్సిక్ సైన్సు కోర్సు చేయొచ్చు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సును డీయూప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. అయితే ఈ కోర్సును ఎన్ని కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉండాలనే అంశానికి సంబంధించి విద్యామండలి ఆమోదం లభించాల్సి ఉంది. మూడు లేదా నాలుగు కళాశాలల్లో ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలని డీయూ భావిస్తోంది. ఇందుకు సంబంధించి శ్రీ గురు తేజ్‌బహదుర్ ఖల్సా కళాశాలకు ఇప్పటికే అనుమతి లభించింది. కాగా ఆప్టికల్ మార్క్ రిజిస్ట్రేషన్ (ఓఎంఆర్) ద్వారా ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయని చెప్పేందుకుగాను దరఖాస్తు కిందిభాగంలో ఓ నక్షత్రాన్ని ఉంచారు.
 
 ఆన్‌లైన్‌లో లక్షకుపైగా దరఖాస్తుల విక్రయం
 ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో ఈ ఏడాది ఆన్‌లైన్ దరఖాస్తులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయా యి. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువసంఖ్య లో దరఖాస్తులు అమ్ముడుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. డీయూ గణాంకాల ప్రకారం ఆన్‌లైన్‌ద్వారా 1,01,188 దరఖాస్తులను విద్యార్థులు కొనుగోలు చేశారు. ఇక ఆఫ్‌లైన్ విషయానికొస్తే మొత్తం 79,293 దరఖాస్తులను విద్యార్థులు డీయూ పరిధిలోని వివిధ కళాశాలల్లో సమర్పించారు. మొత్తం 1,80,481 దరఖాస్తులు తమకు అందాయని డీయూ జాయింట్ డీన్, స్టూడెంట్స్ అండ్ మీడియా కో-ఆర్డినేటర్ మలయ్ నవీన్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తుల విక్రయాలు ఇంకా జోరందుకునే అవకాశముందన్నారు.
 
 హిందీ లేదా సంస్కృతంవైపు మొగ్గు
 హిందీ లేదా సంస్కృతంలో చదువుకోవడానికే ఆఫ్రికన్ విద్యార్థులు మొగ్గుచూపారు. చివరిరోజు కావడంతో విదేశీ విద్యార్థులు మంగళవారం భారీ సం ఖ్యలో తమ తమ దరఖాస్తులను సమర్పించారు. ఈ విషయమై డీయూ ఉన్నతాధికారి అమృత్ కౌర్ బస్రా మీడియాతో మాట్లాడుతూ అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధిం చిన దరఖాస్తుల దాఖలుకు మంగళవారమే చివరి రోజు కావడంతో ఈసారి పెద్దసంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారన్నారు. వాస్తవానికి ఈ కోర్సుల కు తుది గడువు మార్చి 30వ తేదీయే అయినప్పటికీ ఏప్రిల్ 30కి ఒకసారి గడువు పొడిగించిన డీయూ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడంతో జూన్ పదో తేదీకి కూడా పొడిగించిన సంగతి విదితమే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement