రూ.30కే లీటర్ పెట్రోల్
ఇంధన ధర పెంపుపై ఎన్‌ఎస్‌యూఐ వినూత్న నిరసన
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచడాన్ని వ్యతిరేకిస్త్తు ఎన్‌ఎస్‌యూఐ బుధవారం వినూత్నంగా ఆందోళన చేపట్టింది. ఈమేరకు నగరంలోని మౌర్య హోటల్ సర్కిల్‌లోని గూడంగడిలో ఆ సంఘం రాష్ట్రధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో నిరసనకారులు రూ.30కే లీటర్ పెట్రోల్ విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినప్పటికి బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ రేట్లను పెంచుతోందని మంజునాథ్ మండిపడ్డారు. వెంటనే ధరలనుతగ్గించాలని డిమాండ్ చేసారు. ఎన్‌ఎస్‌యూఐకి మద్దతుగా రాజాజీనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ,నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.