అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ ధర్నా | Protest against the arrival of Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ ధర్నా

Published Mon, Jul 6 2015 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ  ధర్నా - Sakshi

అమిత్ షా రాకను వ్యతిరేకిస్తూ ధర్నా

బెంగళూరు: అవినీతికి పాల్పడుతున్న కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) కార్యకర్తలు ధర్నాకు దిగారు. లలిత్ మోదీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాపాడే ధోరణిలో అమిత్ షా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, నగరానికి ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆదివారమిక్కడి కాంగ్రెస్ భవన్ ఎదుట ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

బీజేపీ మహా సంపర్క అభియాన్‌ను నిర్వహించే ప్యాలెస్ గ్రౌండ్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎన్‌ఎస్‌యూఐ నేతలు మొదట భావించారు. అయితే ఆ  ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడంతో కాంగ్రెస్ భవన్ ఎదుట తమ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement