వర్సోవ ప్రాంతంలోని గోమగల్లిలో గురువారం మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వర్సోవ, న్యూస్‌లైన్: వర్సోవ ప్రాంతంలోని గోమగల్లిలో గురువారం మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. వేదిక పరిసరాల్లో నిఘా కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. మహిళా పోలీసు సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వాహనాలను స్థానిక బస్టాప్ వద్ద నిలిపేందుకు అనుమతించారు. కాగా లాంచీల రాకపోకలను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిషేధించినట్లు పోలీసు అధికారి తెలిపారు.