నేడు రాహుల్ రాక
మడికొండలో బహిరంగ సభ
భారీ జన సమీకరణపై నేతల దృష్టి
యువరాజు సభకు ప్రత్యేక భద్రత
ఎస్పీజీ గుప్పిట సభా ప్రాంగణం
వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం జిల్లాకు రానున్నారు. హన్మకొండ శివారు మడికొండలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. ఈ మేరకు 28 ఎకరాల సభా స్థలంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు ముమ్మ రం చేశారు. రాహుల్ జెడ్ ప్లస్ కేటగిరి జాబితాలో ఉన్నం దున అధికార యంత్రాంగం అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది. విస్తృత తనిఖీ నిర్వహించడంతోపాటు సభాస్థలాన్ని ఎస్పీజీ బృందం పూర్తిస్థారుులో అదుపులోకి తీసుకుంది. అదనపు డీజీపీ సుధీప్‌లక్టాకియా, ఇంటెలీజెన్సీ ఐజీ మహేష్ భగవత్ గురువారం సభాస్థలిని సందర్శించి డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావుకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పీసీసీ పరిశీలకుడు రాపోలు జయప్రకాష్ సభాస్థలిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నందున వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయూలని సిబ్బందికి సూచించారు.
భారీ అంచనాలు
రాహుల్ రాక జిల్లాపై ప్రభావం చూపిస్తుందని.. కాంగ్రెస్ అభ్యర్థుల విజయూనికి దోహదం చేస్తుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. సభకు భారీగా జనాన్ని తరలించేందుకు ఇదివరకే కసరత్తు మొదలుపెట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయన ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ నేతలు ఈ సభపై భారీ అంచనాలతో ఉన్నారు. ఎండ ప్రభావం పడే అవకాశముండడం తో జిల్లా నేతల్లో గుబులు నెలకొంది. మొత్తానికీ... రాహుల్ రాక నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోంది