రజనీకాంత్ బహిరంగ లేఖ | Rajinikanth pens OPEN LETTER thanking Sri Lankan Tamils for support! | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ బహిరంగ లేఖ

Published Thu, Mar 30 2017 11:47 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

రజనీకాంత్ బహిరంగ లేఖ

రజనీకాంత్ బహిరంగ లేఖ

చెన్నై: శ్రీలంకలోని తమిళులు తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానులకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంతో ఆ దేశంలో ఉన్న తమిళులను ఉద్దేశిస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు.

'మీరు నా పట్ల చూపుతున్న అభిమానాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నా. మీకు ధన్యవాదాలు చెప్పేందుకు మాటలు చాలడం లేదు. మంచిగా ఆలోచిస్తే, మంచి మాత్రమే జరుగుతుంది. సమయం వచ్చినపుడు మిమ్మల్ని కలుస్తాను. మీరు బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా' అని రజనీ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 9న శ్రీలంకలో జాఫ్నాలో కొత్తగా నిర్మించిన 150 ఇళ్లను తమిళులకు అందించే కార్యక్రమంలో రజనీ పాల్గొనాల్సివుంది. అయితే స్థానిక తమిళ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన లంక పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా రజనీకి మద్దతుగా జాఫ్నాలోని తమిళులు ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement