కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక
బళ్లారి టౌన్:కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక శివరామ గౌడ వర్గం ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం శవయాత్ర చేపట్టారు. అనంతరం స్థానిక రాయల్ సర్కిల్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఎస్.సురేష్ మాట్లాడుతూ బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగరం బంగారప్పనగర్‌లో రాజకుమార్ విగ్రహానికి కొంత మంది దుండగులు నిప్పంటించడం దారుణమన్నారు.
ఇందుకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ అధ్యక్షుడు రాజశేఖర్, వేదిక నేతలు అశోక్, రామమూర్తి, దేవేంద్రప్ప, మృత్యుంజయ, లోకేశ్, మంజు, మల్లికార్జున, కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.