న్యూఢిల్లీ: కేంద్ర పారామిలిటరీ బలగాలు (సీఆర్‌పీఎఫ్) వచ్చే నెల 12వ తేదీన తొలిసారిగా నిర్వహించనున్న యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు. సీఆర్‌పీఎఫ్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఆ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. ఈ విషయమై సీఆర్‌పీఎఫ్ ఉత్తర విభాగం అధికార ప్రతినిధి ప్రశాంత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘మారథాన్ కార్యక్రమాన్ని సచిన్ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించనున్నాం’అని అన్నారు. సచిన్‌తోపాటు మరో క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్, బాక్సర్ మేరీకోమ్, సుశీల్ కుమార్, జస్పాల్ రాణా, అజిత్‌పాల్ సింగ్ తదితర క్రీడా ప్రముఖులు కూడా పాల్గొంటారన్నారు. వీరితోపాటు బాలీవుడ్ నటుడు నానాపటేకర్ కూడా పాల్గొనే అవకాశముందన్నారు. సీఆర్‌పీఎఫ్ అమర జవాన్లకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టామన్నారు.ఈ మార్చ్‌లో విజేతలకు రూ. 19.10 లక్షల బహుమతిని అంద జేయనున్నామన్నారు. కాగా సీఆర్‌పీఎఫ్ 1939లో ఏర్పాటైంది. ఇది దేశవ్యాప్తంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతి విదితమే.
12న యూనిటీ మార్చ్
Published Mon, Sep 29 2014 9:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement