‘కేసు పెడుతున్నా.. ఆశీర్వదించండి’ | Sacked minister Kapil Mishra seeks Arvind Kejriwal’s blessing before filing FIR | Sakshi
Sakshi News home page

‘కేసు పెడుతున్నా.. ఆశీర్వదించండి’

Published Tue, May 9 2017 9:42 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

‘కేసు పెడుతున్నా.. ఆశీర్వదించండి’

‘కేసు పెడుతున్నా.. ఆశీర్వదించండి’

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడిని ఆప్‌ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్‌ మిశ్రా ఉధృతం చేశారు. సీఎం​ పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై కేసు పెడుతున్నట్టు ప్రకటించారు. తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు మంగళవారం ఉదయం మిశ్రాతో మాట్లాడుతూ.. ‘నన్ను ఆశ్వీరదించండి.. మీపై కేసు పెడుతున్నాను’ అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు.

కేజ్రీవాల్‌కు సత్యేంద్రజైన్‌ ఇచ్చిన రూ. 2 కోట్ల లంచంపై సీబీఐకు ఆయనే ఫిర్యాదు చేయనున్నారు. రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్‌ తొక్కిపెట్టారంటూ కపిల్‌ మిశ్రా నిన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని ఏసీబీకి ఆయన అందచేశారు. తనపై ఆరోపణలకు కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. సత్యానిదే తుది విజయమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement