వాట్సప్‌తో భద్రత | Safety with whatsaap | Sakshi
Sakshi News home page

వాట్సప్‌తో భద్రత

Published Sat, Feb 21 2015 1:14 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

రైలు ప్రయాణికుల భద్రత కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర రైల్వే పోలీసులు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

కర్ణాటక రైల్వే పోలీసుల వినూత్న ప్రయోగం
ప్రారంభించిన రాష్ర్ట హోం శాఖ మంత్రి జార్‌‌జ

 
బెంగళూరు: రైలు ప్రయాణికుల భద్రత కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర రైల్వే పోలీ సులు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్లు, పట్టాలతో పాటు రైళ్లలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కని పించినా తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా ‘వాట్సప్’ను ప్రారంభించారు. ఇక సెల్‌ఫోన్‌లలో వాట్సప్ సదుపాయం లేని వారి కోసం ప్రత్యేక సహాయవాణి, వాయ్స్‌అన్‌లాగ్‌తో పాటు  సీసీ కెమెరాల మానిటరింగ్ సెంటర్‌ను సై తం అందుబాటులోకి తీసుకొచ్చారు. శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అత్యాధునిక వ్యవస్థలను రాష్ట్ర హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ....రాష్ట్రంలో ప్రతి ఏడాది దాదాపు 24కోట్ల మం ది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. 1977 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రైల్వే శాఖలో ఉ ద్యోగాల భర్తీ జరగక పోవడంతో ప్రయాణికుల రక్ష ణ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారిందని అన్నా రు. అందుకే ప్రయాణికుల భద్రతే ముఖ్య ధ్యే యంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి దినేష్ గుండూరావు, డీజీపీ లాల్ రుఖుమ్ పచావో,  హోంశాఖ సలహాదారు కెంపయ్య పాల్గొన్నారు.
 
ఈ వాట్సప్ నంబర్‌కు సందేశం పంపితే సరి.....


ఇక ప్రయాణికులు రైల్వేస్టేషన్లు, పట్టాలతో పాటు రైళ్లలో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే  వాట్సప్ సంఖ్య 9480802140కు సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. అంతేకాక అలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల ఫొటోలను సైతం ఈ వాట్సప్ సంఖ్య ద్వారా పంపవచ్చు. తద్వారా ప్రమాదాలు, ఉగ్రవాద ఘటనలను నిరోధించడంతో పాటు అనుమానిత వ్యక్తులను సులభంగా గుర్తించే సౌలభ్యం కలగనుంది. ఇక తమ ఫోన్‌లలో వాట్సప్ సదుపాయం లేనివారు 18004251363 సహాయవాణి నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చు. ఇక రాష్ట్రంలోని అన్ని రైల్వేస్టేషన్‌లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి శిక్షణ పొందిన 300 మంది ప్రజా పోలీసింగ్ వ్యవస్థలో భాగంగా నియమించారు. ఈ వ్యవస్థలన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన ఓ ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా రాష్ట్రంలో మొత్తం 3,089కిలోమీటర్ల మేర రైల్వే మార్గం ఉండగా, ఈ మార్గంలో మొత్తం 1,131రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 362రైల్వేస్టేషన్లు, 620ప్లాట్‌ఫామ్‌లు ఉండగా ప్రతిరోజూ 8.5లక్షల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా ప్రయాణికులు సాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement