అనేగన్‌తో ఈ ఇద్దరు భామలు | Samantha Joins Amy Jackson for Dhanush's Next Movie | Sakshi
Sakshi News home page

అనేగన్‌తో ఈ ఇద్దరు భామలు

Published Tue, Feb 24 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

అనేగన్‌తో ఈ ఇద్దరు భామలు

అనేగన్‌తో ఈ ఇద్దరు భామలు

 ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్న నటుడు ధనుష్. గత ఏడాది ద్వితీయార్థం నుంచే విజయాలు ఆయనకు వరుస కడుతున్నాయి. గత ఏడాది విడుదలైన సొంత చిత్రం వేలై ఇల్లాద పట్టదారి ఘన విజయం సాధించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో బాలీవుడ్ చిత్రం షమితాబ్ విజయంతోపాటుగా, ధనుష్ నటనకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ చిత్రం వెంటే విడుదలైన అనేగన్ అమోఘ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నెల 27న శివకార్తీకేయన్ హీరోగా ధనుష్ నిర్మించిన ఖాకీ చట్టై విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
 
  ప్రస్తుతం ధనూష్ మారీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన ఈ చిత్రంలో నిరు పేదల తరపున పోరాడే నాయకుడిగా తెరపైకి రానున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ నాయకీగా నటిస్తున్నారు. తదుపరి వేలై ఇల్లాద పట్టదారి టీంతో పనిచేయడానికి ధనుష్ సిద్ధం అవుతున్నారు. వీఐపీ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ప్రముఖ చాయా గ్రాహకుడు వేల్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం మారీ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న అనిరుధ్‌ను తదుపరి చిత్రానికి సంగీత బాణీలు కట్టనున్నారు.
 
 ఈ చిత్రంలో ధనుష్ సరసన ఇంగ్లీషు భామ ఎమిజాక్సన్‌తోపాటుగా చెన్నై చిన్నది సమంత కూడా రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఎమిజాక్సన్ ప్రస్తుతం యువ నటుడు, నిర్మాత ఉదయ నిధి స్టాలిన్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. సమంత విషయానికి వస్తే విక్రమ్ సరసన నటించిన పత్తు ఎన్‌డ్రదుకుల్లే చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో ఇళయదళపతి విజయ్‌తో అంజాన్ హీరో సూర్యతోను జత కట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు చిత్రాల మధ్య ధనుష్‌కు కాల్ షీట్ సర్దుబాటు చేయడానికి సిద్ధం అయ్యారని సమాచారం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement