సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో వార్డులవారీగా ఫలితాల వెల్లడికి తాము వ్యతిరేకమేనని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. లెక్కింపు పూర్తయ్యాక నియోజకవర్గం మొత్తంగా ఒకేసారి ఫలితాన్ని వెల్లడించే విధానాన్ని ప్రవేశపెట్టాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామంది. గోప్యతతో కూడిన ఓటు హక్కును కాపాడేందుకు చట్టానికి సవరణలు చేయాల్సిందిగా సూచించినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించడాన్ని నిలిపివేయాలని, మొత్తం నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ యోగేశ్ గుప్తా అనే న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు.
ఏ వార్డు లేదా ప్రాంతంలో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడించడం వల్ల రాజకీయ పార్టీలు తమకు ఓట్లు రాని ప్రాంతాలపై వివక్ష చూపే ప్రమాదం ఉందని, అది సమతుల అభివృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం బుధవారం కోర్టుకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీనిపై ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా ఈసీని కోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఈ అంశంపై నాలుగు వారాల్లో స్పందన తెలిపాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.
వార్డులవారీ ఫలితాలకు వ్యతిరేకమే
Published Thu, May 22 2014 1:46 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
Advertisement