న్యూఢిల్లీ : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రాష్ట్ర విభాగం ఖాతాపై ఆదాయపన్ను శాఖ దృష్టిపడింది. డిపాజిటర్ల వివరాలు లేకుండా రూ. 34 కోట్లు పార్టీ ఖాతాలోకి చేరడంతో వెంటనే అందుకు సంబంధినంచిన దస్తావేజులు వివరాలు అందించాలంటూ ఎన్‌సీపీకి సమన్లు జారీ చేసింది. నారిమన్ పాయింట్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో ఉన్న ఎన్‌సీపీ ఖాతాలో 2013 ఏప్రిల్ 1 నుంచి 2014 ఏప్రిల్ ఒకటి వరకు జరిగిన లావాదేవీలను గమనించిన ఐటీ అధికారులు... వాటి వివరాలు ఇవ్వాలని కోరారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పార్టీల ఖర్చులను సమీక్షించాలనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ విచారణ జరిపినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇలాంటి డిపాజిట్లకు పాన్ కార్డు నంబర్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని, అయితే జమ చేసిన ఏ ఒక్కరి వివరాలు వెల్లడించకపోవడమేమిట ని ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ సంవత్సర కాలంలో మొత్తం 34.75 కోట్ల రూపాయలు పార్టీ ఖాతాలో జమ అయ్యాయి. అయితే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నియోజకవర్గాలనుంచి రూ. 100, రూ. 500, రూ. 1,000 కూపన్ల ద్వారా పార్టీ నిధులు వసూలు చేసిందని నగరంలోని ార్టీ ఛార్టర్డ్ అకౌంటెంట్ సంస్థ దేవీ అండ్ కో తెలిపింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ. 20 వేలకు పైగా జమ చేస్తే జమదారుడికి సంబంధించిన పాన్ కార్డ్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అడ్రస్ పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. కాగా పార్టీ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నందున జూన్ మొదటి వారం వరకు సమయం ఇవ్వాలని సీఏ సంస్థ ఐటీ అధికారులను కోరింది.
జిల్లాల్లోని పలువురు ప్రజా ప్రతినిధులు, ఆఫీస్ బేరర్ల పర్యవేక్షణలో పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు విరాళంగా ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలకు రూ. 1,000, రూ. 500, రూ. 100 కూపన్ బుక్‌లెట్లను కూడా పంపిణీ చేశారు. ఒక్క వ్యక్తి నుంచి రూ. 20 వేలకు మించి తీసుకోలేదని, అందుకే పాన్ నంబర్‌కానీ, బ్యాంకు ఖాతా వివరాలు కానీ లేవని సీఏ సంస్థ వెల్లడించింది. పార్టీ అడిగిన సమయం ఇచ్చినట్టు ఐటీ అధికారులు తెలిపారు. అయితే నిధులు ఇచ్చిన వారందరి వివరాలు తమ దగ్గర న్నాయని, త్వరలోనే ఆ వివరాలన్నీ ఐటీ అధికారులకు ఇస్తామని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు.
ఇదిలాఉండగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించిన ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే విషయమై పార్టీ అధినేత శరద్‌పవార్ నేతృత్వలో ఇటీవలే సమావేశమైన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికలకు వెళ్లేముందు ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు.
గడ్కరీపై కేసుల్లేవ్: ఐటీశాఖ
నాగపూర్: బీజేపీ నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.నాగపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుమిత్ దళాల్ సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డెరైక్టరేట్ పై సమాధానాన్నిచ్చింది. గడ్కరీపై ఎటువంటి దర్యాప్తు కొనసాగడంలేదని, పెండింగ్‌లో ఏ కేసులు కూడా లేవని తెలిపింది.
రూ. 34 కోట్ల డిపాజిట్ ముంబై ఎన్సీపీపై ఐటీ నజర్
Published Mon, May 12 2014 11:25 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement