టీచర్‌ను వేధించిన శివసేన నేతపై కేసు | Shiv Sena leader harassed concern On the case | Sakshi
Sakshi News home page

టీచర్‌ను వేధించిన శివసేన నేతపై కేసు

Published Sun, Feb 22 2015 3:48 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

టీచర్‌ను వేధించిన శివసేన నేతపై కేసు - Sakshi

టీచర్‌ను వేధించిన శివసేన నేతపై కేసు

సాక్షి, ముంబై:  జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలితో అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణపై శివసేన మాజీ తాలూకా అధ్యక్షుడు గణేష్ అధానేపై ఔరంగాబాద్ జిల్లా కుల్‌తాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో గణేష్ అదానేను పార్టీ నుంచి బహిష్కరించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, తిరిగి ఈ నెల 6వ తేదీన గణేష్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. తనను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని చెప్పారు.

గణేష్ అదానే కుటుంబసభ్యుల సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రేకు ఓ లేఖ రాయడంతో ఆయన 18న ముంబైలోని శివసేన కార్యాలయానికి పిలిపించుకుని అన్ని విషయాలు తెలుసుకున్నారని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని సీరీయస్‌గా తీసుకున్న ఉద్ధవ్ ఠాక్రే వెంటనే గణేష్‌ను శుక్రవారం పార్టీ నుంచి బహిష్కరించారు. ఇది జరిగిన వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement