‘స్టైల్‌కింగ్’గా గోల్డెన్‌స్టార్ గణేష్ | 'Stailking' Golden Star Ganesh | Sakshi
Sakshi News home page

‘స్టైల్‌కింగ్’గా గోల్డెన్‌స్టార్ గణేష్

Published Sun, Aug 17 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

'Stailking' Golden Star Ganesh

  •  ఫస్ట్‌లుక్ కు అనూహ్య స్పందన
  • ఇప్పటి వరకు లవర్‌బాయ్‌గా కనిపిస్తూ, సాఫ్ట్ క్యారెక్టర్‌లతో శాండల్‌వుడ్ తెరపై తళుక్కుమన్న గోల్డెన్‌స్టార్ గణేష్ ఇప్పుడు తన స్టైల్‌ని మార్చుకున్నాడు. పూర్తి స్టైలిష్‌గా, కాస్తంత రఫ్‌గా తయారయ్యాడు. ‘స్టైల్‌కింగ్’ సినిమా ద్వారా సరికొత్త స్టైల్‌లో గణేష్ శాండల్‌వుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ దర్శకుడు పీసీ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మారుతి జడియార్ ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. కాస్తంత చెదిరిన జుట్టు, సరికొత్త స్టైల్‌లో గణేష్ కనిపించే ఈ ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాలో గణేష్ ద్విపాత్రాభినయం చేయనుండడంతో పాటు ఈ సినిమా గణేష్‌కి 25వ సినిమా కావడం మరో విశేషం.

    ఈ ట్రైలర్‌లో కేవలం గణేష్ ఒక పాత్రను మాత్రమే చూపించామని, మరో పాత్రను సినిమాలో చూడాల్సిందేనని దర్శకుడు శేఖర్ చెబుతున్నారు. దీంతో ‘స్టైల్‌కింగ్’లో మరో పాత్రలో గణేష్ ఎలా కనిపించనున్నారనే విషయంపై సినీ అభిమానుల్లో కుతూహలం పెరుగుతోంది.                            
     - సాక్షి, బెంగళూరు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement