చీర కోసం శివగామి..
అన్నానగర్(చెన్నై): అమ్మాయిలకు చీరలు అంటే చాలా మక్కువ. ఆ మక్కువే ఓ విద్యార్ధిని ప్రాణాలు తీసింది. ఈ సంఘటన నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. సురన్‌డైయిలో కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు, చీర కొనివ్వలేదని ఇంతటి దారుణానికి పాల్పడింది.
వివరాలు.. నెల్లై జిల్లా సురన్‌డైయిలో శివగురు నాథపురం కామరాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన రైతు సెల్వరాజ్. ఇతని కుమార్తె శివగామి (18). ఓ ప్రైవేటు కళాశాలలో బిఎస్‌సి కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో శివగామి తల్లికి ఆమె బంధువు ఒకరు తన ఊరులో జరుగుతున్న ఆలయ వేడుక కోసం ఓ కొత్త చీర కొనిచ్చారు. ఆ చీరను చూసిన శివగామి, తనకు కొత్త చీర కొనివ్వమని తల్లిని అడిగింది. దానికి మన ఊరులో ఆలయ ఉత్సవాలు జరిగినప్పుడు చీర కొనిస్తామని చెప్పారు.
అప్పుడు శివగామికి, ఆమె తల్లికి మధ్య బాగా తగాదా జరిగింది. తల్లిదండ్రులు చీర కొనివ్వటం లేదని మనస్థాపం చెందిన శివగామి బుధవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో విషం తాగింది. ఇది చూసిన స్థానికులు ఆమెను తెన్‌కాశి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం పాళయంగోడు ఐకిరవుండు ఆసుపత్రిలో చేర్చారు.
కాని అక్కడ చికిత్సపొందుతూ శివగామి మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న సురన్‌డైయి పోలీసు ఇన్‌స్పెక్టర్ కవిత సంఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పోస్టుమార్గానికి తరలించారు. అనంతరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చీర కోసం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.