సాక్షి, ముంబై: నగర రోడ్లపై నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైతే వాహనాల రిజిస్ట్రేషన్‌లో పరిమితి విధించే అంశా న్ని అధ్యయనం చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అంతర్జాతీయ నగరమైన సింగపూర్‌లో ఎలా చర్యలు తీసుకుంటున్నారో పరి శీలించాలని కోరారు. అక్కడి ప్రభుత్వం వాహనాల నమోదు సంఖ్యను పరిమితం చేయడంతో అక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం లేదన్నారు. వారు ఎప్పటికప్పుడు పాత కార్లను తొల గించి కొత్త కార్లను ఉపయోగిస్తూ ఉంటారని చవాన్ పేర్కొన్నారు. ఐదు ప్రమాదాల కన్నా ఎక్కువ ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు తిరిగి విధులు అప్పగించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ, బెస్ట్ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
ఇదిలావుండగా నిత్యం నగర రోడ్లపై దాదాపు 20 లక్షల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఇందులో 35 శాతం వాహనాలు ఆరేళ్లకు పైబడినవే ఉన్నాయి. ద్విచక్రవాహనాలు 43 శాతం, కార్లు 34 శాతానికి పెరిగాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమ స్య పెరుగుతోంది. రోడ్ల వెడల్పు, పొడవు కూడా వాహనాలకు తగ్గట్లుగా పెంచకపోవడం కూడా ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుంది. ధర తగ్గడం, నగరవాసుల ఆదాయం పెరగడం కూడా వాహనాల సంఖ్య పెరగడానికి మరో కారణమని అధికారులు భావిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలపడం ద్వారా ఎదురవుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఉన్నామని ఆర్టీవో అధికారి ఒకరు తెలిపారు.
ఇలాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో రోడ్లకు ఇరువైపులా వాహనాలను పార్క్ చేసి ఉంచడంతో పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు కూడా కరువయ్యాయన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు రోడ్డు ప్రమాదం సంభవిస్తోందని, జాగ్రత్తపరమైన చర్యలు చేపట్టకపోతే 2020లో ప్రతి మూడు నిమిషాలకు ఆరు రోడ్డు ప్రమాదాల మరణాలు సంభవించే అవకాశం ఉంద ని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే అంధేరీ ఆర్టీవోలో డమ్మీ వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నామని తెలి పారు. ఇదిలావుండగా ప్రమాదాలు జరగడానికి ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్టీసీ తక్కువ నాణ్యత గల బస్సులను నడుపుతోందని, ఈ డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమని హోంశాఖ మంత్రి పాటిల్ తెలిపారు.
సింగపూర్‌ను స్టడీ చెయ్యండి
Published Sun, Jan 5 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement