అక్కడ విమాన సర్వీసులు వాయిదా? | Tamil Nadu may Request Deferment of Flight Resumption in State | Sakshi
Sakshi News home page

తమిళనాట విమాన సర్వీసులు వాయిదా?

Published Sat, May 23 2020 2:23 PM | Last Updated on Sat, May 23 2020 2:27 PM

Tamil Nadu may Request Deferment of Flight Resumption in State - Sakshi

చెన్నై: తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. విదేశాల నుంచి విమానాల్లో, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించగా 66 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది.  

దేశంలో కరోనా వైరస్ కేసుల్లో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడులో ఇప్పటివరకు 14,753 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 98 మరణాలు సంభవించాయి. కోవిడ్‌-19 బారిన పడిన వారిలో 7,128 మంది కోలుకున్నారు. (కరోనా: కర్ణాటక కీలక నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement