టీవీ నటి భర్త ఆత్మహత్య.. షాకింగ్‌ విషయాలు | Tamil TV actor’s husband kills self, blames father-in-law. Wife has a different story to tell | Sakshi
Sakshi News home page

టీవీ నటి భర్త ఆత్మహత్య.. షాకింగ్‌ విషయాలు

Published Wed, Apr 5 2017 7:55 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

టీవీ నటి భర్త ఆత్మహత్య.. షాకింగ్‌ విషయాలు - Sakshi

టీవీ నటి భర్త ఆత్మహత్య.. షాకింగ్‌ విషయాలు

చెన్నై:  ప్రముఖ టాలీవుడ్‌ నటి జయసుధ భర్త ఆత్మహత్య మరువక ముందే మరో  దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ టివీ, సినీ నటి నందిని(30) భర్త కార్తికేయన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.  ఆర్థిక ఇబ్బందుల వల్లే అతను ఆత్మహత్య  చేసుకున్నట్టు ప్రాథమికంగా అందుతున్న సమాచారం.  విరుగంబాక్కమ్‌లోని ఓ లాడ్జ్‌లో ఆయన విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.  హోటల్‌ సిబ్బంది ద్వారా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  ఆర్ధిక ఇబ్బందుల వల్ల జిమ్ మూతపడంతో మనస్తాపం చెందిన  ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖ కూడా రాశారు. ఈ సూసైడ్‌ నోట్‌  ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నైలో జిమ్ నడుపుతున్న కార్తికేయన్ మొదటి భార్య చనిపోవడంతో గత ఏడాది జూన్‌లో నందినిని వివాహం చేసుకున్నారు. కానీ  మనస్పర్థల కారణంగా వీరిద్దరు కూడా విడిపోయారు. అయితే  కార్తికేయన్ ఆత్మహత్యకు మొదట  నందిని తండ్రి  బాధ్యుడన్న వార్తలొచ్చాయి.  కార్తీక్ ఆత్మహత్యపై  వస్తున్న ఆరోపణలపై  స్పందించిన నందిని  ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని ఖండించారు.  తమిళ పత్రికల్లో మాట్లాడుతూ  ఆమె విభిన్నమైన అంశాలను వివరించారు.  ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందివద్ద డబ్బులు తీసుకున్నాడని తెలిపింది. ఆ డబ్బులకోసం చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని,  దీంతో కార్తీక్‌ని తాను నిలదీసానని  చెప్పింది.  ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తన తల్లిదండ్రులు అతణ్ణించి తనను దూరంగా తీసుకెళ్లారని వివరించింది.  ఈ ఘటనతో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. అలాగే తన భర‍్తకు వేరే అమ్మాయితో వివాహేత సంబంధం ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కార్తీక్‌ ను గతంలో అరెస్ట్‌ చేశారని తెలిపింది. అయితే వీటన్నింటినీ  ఎవరికీ చెప్పకుండా తన  మనసులోనే దాచుకున్నాననీ.. కానీ కార్తీక్‌ ఆత్మహత్య కారణంగా తన పరువు బజారున పడిందని వాపోయింది.  డబ్బుల కోసం తాను కార్తీక్‌ని వేధించలేదని  కానీ అతను కేవలం  డబ్బు కోసం తనను వివాహం చేసుకున్నాడని నందిని ఆరోపించింది. 

కాగా  నందిని టీవీ సీరియల్‌ శరవణన్ మీనాక్షి లోని మైనా  పాత్ర ద్వారా పాపులర్‌ అయ్యారు. వంశం, కేడి బిల్లా కిలాడి రంగ లాంటి తమిళ సినిమాల్లోకూడా నటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement