అన్నింటికీ ఆమోదం! | tamilnadu Assembly meetings will be held on the 14th of this month. | Sakshi
Sakshi News home page

అన్నింటికీ ఆమోదం!

Published Fri, Jun 9 2017 3:04 AM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

అన్నింటికీ ఆమోదం!

అన్నింటికీ ఆమోదం!

రిజిస్ట్రేషన్‌లో మార్కెట్‌ విలువ తగ్గింపు
జీఎస్టీకి ఆమోదం
విద్యా మార్పునకు గ్రీన్‌ సిగ్నల్‌
అసెంబ్లీ వేదికగా అధికార ప్రకటనలు
మంత్రి వర్గ భేటీలో నిర్ణయం

అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాలు, తీసుకు రావాల్సిన ముసాయిదాలు, విద్యా విధానంలో మార్పులు,  కొత్త పథకాల కు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. భూముల రిజిస్ట్రేషన్‌లలో మార్కెట్‌ విలువ  33 శాతం మేరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ వేదికగా అన్ని నిర్ణయాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
సాక్షి, చెన్నై : సీఎంగా ఎడపాడి పళని స్వామి పగ్గాలు చేపట్టినానంతరం మంత్రి వర్గంతో చర్చించకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోవడం లేదని చెప్పవచ్చు. ఆయన పగ్గాలు చేపట్టిన వంద రోజుల్లో ఐదు సార్లు కేబినెట్‌ను సమావేశ పరచడం ఇందుకు ఓ నిదర్శనం. ఈనెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి.

ఇందులో చర్చించాల్సిన అంశాలు, ప్రధాన ప్రతి పక్షాన్ని ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకునే విధంగా గురువారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం సాగింది. సీఎం పళని స్వామి నేతృత్వంలో జరిగిన ఈç Üమావేశానికి 33 మంది మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది.

అన్నింటికీ ఆమోదం:
మంత్రి వర్గంలో తొలుత శాఖల వారీగా సీఎం సమీక్ష సాగించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో శాఖల వారీగా నిధుల కేటా యింపుల చర్చ సాగనున్న దృష్ట్యా, ఆయా శాఖల పరిధిలోని పథకాలు, సమస్యలు, నిధులు, పెండింగ్‌ ప్రాజెక్టులు తదితర అంశాలను సమీక్షించారు. ఆయా శాఖలకు 2017–18కిగాను కేటాయింపుల గురించి చర్చించారు. అసెంబ్లీలో ఆయా శాఖల వారీగా ప్రవేశ పెట్టనున్న కొత్త ముసాయిదాలు మంత్రి వర్గం ముందుకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

ఆ మేరకు ప్రధానంగా నీట్‌కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం లక్ష్యంగా విద్యా విధానంలో మార్పు, జూలై ఒకటో తేది నుంచి అమల్లోకి రానున్న జిఎస్‌టీ గురించి చర్చ సాగింది. జిఎస్‌టీలో కొన్ని మినహాయింపుల మీద పరిశీలన సాగినట్టు తెలిసింది. అమ్మ పేరిట ఉన్న పథకాలను విస్తృతం చేయడం లక్ష్యంగా శాఖల వారీగా ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రకటించేందుకు నిర్ణయించి ఉన్నారు.అలాగే, అసెంబ్లీలో అమ్మ జయలలిత తరహాలో 110 నిబంధనల మేరకు ప్రత్యేక ప్రకటనలు చేయడానికి కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. అమ్మ పేరిట ఏదేని కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గ కసరత్తులకు ఈసందర్భంగా అధికారుల్ని ఆదేశించినట్టు తెలిసింది.

ఇక, రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నేతృత్వంలో 70 చోట్ల క్వారీల ఏర్పాటుకు పరిశీలన సాగించి, అందుకు తగ్గ ఆమోదం తెలిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఇక, కోర్టు ఆదేశాలు, గతంలో పెంచినభూమి విలువ మేరకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌శాఖ ఢీలా పడ్డ విషయం తెలిసిందే.ఈ శాఖను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో మార్కెట్‌ విలువలో స్థలం విలువ 33 శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ, శుక్రవారం నుంచే అమలు చేయడానికి నిర్ణయించడం విశేషం.

అలాగే, స్థానిక ఎన్నికల మీద దృష్టి పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రిజర్వేషన్ల వర్తింపు వ్యవహారంపై చర్చ సాగినా, తది నిర్ణయం పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది.  ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే విధంగా మంత్రులు ఎవ్వరెవ్వరు ఏఏ సమయాల్లో స్పందించాలి, తలా ఓ దిక్కుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేల రూపంలో సభా మందిరంలో  ఏదేని చిక్కులు ఎదురు కాకుండా, గాడిలో పెట్టడం లక్ష్యంగా కొందరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలను సీఎం అప్పగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.


లక్ష్యంగా విద్యా విధానంలో మార్పు, జూలై ఒకటో తేది నుంచి అమల్లోకి రానున్న జీఎస్‌టీ గురించి చర్చ సాగింది. జీఎస్‌టీలో కొన్ని మినహాయింపుల మీద పరిశీలన సాగినట్టు తెలిసిం ది. అమ్మ పేరిట ఉన్న పథకాలను విస్తృతం చేయడం లక్ష్యంగా శాఖల వారీగా ప్రత్యేక నిధుల కేటాయింపు, కొత్త అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రకటించేందుకు నిర్ణయించి ఉన్నారు.అలాగే, అసెంబ్లీలో అమ్మ జయలలిత తరహాలో 110 నిబంధనల మేరకు ప్రత్యేక ప్రకటనలు చేయడానికి కార్యచరణ సిద్ధం చేశారు. అమ్మ పేరిట ఏదేని కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు తగ్గ కసరత్తులకు ఈసందర్భంగా అధికారుల్ని ఆదేశించినట్టు తెలిసింది.

ఇక, రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నేతృత్వంలో 70 చోట్ల క్వారీల ఏర్పాటుకు పరిశీలన సాగించి, అందుకు తగ్గ ఆమోదం తెలిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి.ఇక, కోర్టు ఆదేశాలు, గతంలో పెంచినభూమి విలువ మేరకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌శాఖ ఢీలా పడ్డ విషయం తెలిసిందే.ఈ శాఖను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో మార్కెట్‌ విలువలో స్థలం విలువ 33 శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ, శుక్రవారం నుంచే అమలు చేయడానికి నిర్ణయించడం విశేషం.

అలాగే, స్థానిక ఎన్నికల మీద దృష్టి పెడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. రిజర్వేషన్ల వర్తింపు వ్యవహారంపై చర్చ సాగినా, తది నిర్ణయం పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది.  ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్షాన్ని ఎదుర్కొనే విధంగా మంత్రులు ఎవరెవ్వరు ఏఏ సమయాల్లో స్పందించాలి, తలా ఓ దిక్కుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేల రూపంలో సభా మందిరంలో  ఏదేని చిక్కులు ఎదురు కాకుండా, గాడిలో పెట్టడం లక్ష్యంగా కొందరు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలను సీఎం అప్పగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement