మెదక్ జిల్లా ఆందోల్ మండలం రాంసాన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
మెదక్ జిల్లా ఆందోల్ మండలం రాంసాన్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామానికి చెందిన అనసూయ(28) మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా చనిపోయింది. ఇందుకు ఆమె భర్త సుకుమారే కారణమని ఆరోపిస్తూ బంధువులు అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారించబోయారు. అయితే, తీవ్ర ఆగ్రహంతో ఉన్న బంధువులు ఎస్సై, హోంగార్డులపై కూడా దాడి చేశారు. ఈ పరిణామంతో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.