సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో నేరాల సంఖ్య గత ఏడాది రికార్డులను దాటిపోయింది. 2012 ఏడాదితో పోలిస్తే 2013లో 43.6 శాతంమేర నేరాలు పెరిగినట్టు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు ఏటా నిర్వహించే వార్షిక పత్రికా సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. మహిళలపై దాడులు 412 శాతం పెరిగినట్టు పోలీస్ కమిషనర్ స్వయంగా వెల్లడించారు. 2013లో 1,559 అత్యాచార కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. 2012తో పోలిస్తే 129 శాతం అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. నిర్భ య అత్యాచార ఘటన తర్వాతకూడా నగరంలో మహిళల రక్షణ మెరుగుపడలేదనడానికి ఇదే నిదర్శనం.
ఢిల్లీ సీపీ పేర్కొన్న ప్రకారం 2012లో 51,479 కేసులు నమోదవగా, 2013లో 73,958 కేసులతో 43.67 శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల్లో నగర పోలీసు లు 48.8 కేసులను పరిష్కరించగలిగారు.‘ ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రజలకు నిర్లక్ష్యం చెయ్యొద్దన్నాం. అందుకే కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నా రు. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువచేసేలా పీపుల్స్ ఫెండ్రీ పోలీసింగ్‌ను అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు.
సీపీ వెల్లడించిన వివరాలు
నగరంలో ఈ ఏడాది నమోదైన అత్యాచార కేసుల్లో 96 శాతం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు తెలిసినవారే. ఇలాంటి 90 శాతం కేసులను పోలీసులు పరిష్కరించారు.
మహిళలపై నేరాలకు పాల్పడినట్టు నమోదైన కేసుల్లో 77 శాతం కేసులను ఫిర్యాదు అందిన వారంలోనే పరిష్కరించారు.
అత్యాచార కేసుల్లో చార్జిషీట్ తప్పనిసరి చేస్తూ వచ్చిన కొత్త నిబంధనతో 20 రోజులలోగానే నిందితుడి అరెస్టు అనివార్యమైంది.
బాలికలు, మహిళల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీసీఆర్ వ్యాన్ల సంఖ్యను పెంచారు.
మహిళల రక్షణకు 1091 హెల్ప్‌లైన్ ఏర్పాటు.
370 పీసీఆర్ వ్యాన్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరంలో పీసీఆర్ వ్యాన్ల సంఖ్య 807కి చేరింది.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన 30,130 మంది ని పీసీఆర్ వ్యాన్ల సిబ్బంది ఆసుపత్రుల్లో
చేర్పించింది.
అదృశ్యమవుతున్న చిన్నారుల జాడ కనిపెట్టడంపైనా నగర పోలీసులు దృష్టి సారించారు. చిన్నారుల అదృశ్యం కేసుల్లో ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు.
2012లో 3,503 అపహరణ కేసులు నమోదవగా 2013లో కిడ్నాప్ కేసుల సంఖ్య 5,565కి చేరింది.
వృద్ధుల రక్షణలో భాగంగా ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్ లిస్టులో 18,574 మందిని చేర్చుకున్నారు.
నగరంలో భద్రతా చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా మార్కెట్లు, పలు కీలక ప్రదేశాల్లో కలిపి మొత్తం 5,333 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా 2013లో మద్యం తాగి వాహనాలను నడుపుతు న్న 24,564 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటి ంచని 3,397 మందిని కారాగారానికి పంపారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారివద్ద నుంచి చలాన్ల రూపంలో 59.34 కోట్లు వసూలు చేశారు.
2013లో మొత్తం 11 మంది ఉగ్రవాదులను అరె స్టు చేశారు.
536 మందిని మద్యం సరఫరా చేస్తుండగా అరె స్టు చేశారు. 9,432 మందిని క్రిమినల్ కేసుల్లో అరెస్టు చేశారు.
రికార్డులు దాటిన నేరాలు
Published Fri, Jan 3 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement